: కరిష్మాకపూర్ కు విడాకులు మంజూరు
ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ కు ఆమె భర్త సంజయ్ కపూర్ నుంచి విడాకులు లభించాయి. 2003లో సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఇవి తీవ్రరూపం దాల్చడంతో పరస్పర ఆరోపణలు చేసుకున్న ఈ జంట 2014లో విడాకుల కోసం ముంబై ఫ్యామిలీ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు నేడు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుండగా, శని, ఆదివారాల్లో వారు సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది.