: విజయవాడ వేదికగా ఇంటర్నేషనల్ ఇంటెలిజెంట్ సమ్మిట్


అంతర్జాతీయ వైద్య సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జులై 10న ఇంటర్నేషనల్ ఇంటిలిజెంట్‌ హెల్త్‌ సమ్మిట్‌ పేరిట సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులతోపాటు, భారత దేశంలోని పలువురు వైద్యులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. సుమారు 500 మందికి పైగా అతిథులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో వైద్య ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News