: నిన్ను చూసి గర్విస్తున్నా... నీలా ఆడాలనుంది: కోహ్లీ, సైనా సంభాషణ


భారత్ స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ గెలుచుకున్న సైనాను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తారు. ఈ క్రమంలో కోహ్లీ, సైనా మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సైనా విజయం సాధించిన కొన్ని నిమిషాలకే కోహ్లీ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో 'నిన్ను చూసి దేశం గర్విస్తోంది. నీ ఆట తీరు చూసి చాలా సంతోషంగా ఉంది. నీలా విజయాలు సాధించాలని ఉంది' అని కోహ్లి పేర్కొన్నాడు. దీనికి సమాధానమిచ్చిన సైనా 'నీలా దూకుడుగా ఆడాలని ఉంది. విజయాలు సాధించడానికి నీవు చూపించే దూకుడు అమోఘం. నేను కూడా అలా ఆడాలని అనుకుంటున్నా. దానికోసం శ్రమిస్తా' అని పేర్కొంది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News