: గంగానది ఇక్కడి ప్రజల్లో కొత్త ఉత్తేజం ఇచ్చింది: అలహాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ఈరోజు పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, పారికర్, ఉమాభారతి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పలువురు ప్రముఖ నేతలు ఉత్తరప్రదేశ్ నుంచే నుంచే వచ్చారని ఆయన అన్నారు. ‘ఈ నేల గంగ, యమున, సరస్వతి ప్రవహించిన పవిత్ర త్రివేణి సంగమం’ అని మోదీ అన్నారు. ‘గంగా నది ఇక్కడి ప్రజల్లో కొత్త ఉత్తేజం ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లో వికాస్ యజ్ఞం ప్రారంభం కాబోతుందని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ప్రజలకు వివరించారు.