: ముద్రగడపై పోలీసులు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు.. హెచ్ఆర్‌సీకి కాపు నేతల ఫిర్యాదు
తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తమ నేత ముద్రగడ పద్మనాభం పట్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారంటూ కాపు సద్భావన సంఘం నేతలు హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఏపీ పోలీసుల తీరుపై విచారణ జరిపించాలని కోరారు. ముద్రగడను అరెస్టు చేసిన సందర్భంగాను, తదనంతర పరిణామాల్లోను పోలీసులు ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరుపై వారు సవివరంగా ఫిర్యాదు చేశారు.