: జింబాబ్వే సిరీస్ భారత్ వశం...8 వికెట్ల తేడాతో రెండో వన్డేలో విజయం


మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా జింబాబ్వే సిరీస్ ను గెలుచుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు సత్తచాటారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు భారత బౌలర్ల ధాటికి తాళలేక 34.4 ఓవర్లలో కేవలం 126 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 26.5 ఓవర్లలో కేఎల్ రాహుల్ (33), కరుణ్ నాయర్ (39) ల వికెట్లు కోల్పోయింది. తర్వాత రాయుడు (41), పాండే (4) రాణించడంతో 127 పరుగులు సాధించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మూడు వికెట్లు తీసిన చాహల్ నిలిచాడు. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News