: చప్పగా సాగుతున్న టీమిండియా 'జింబాబ్వే' టూర్!


టీమిండియా ఏ దేశానికైనా టూర్ కు వెళ్తోందంటే అంతో ఇంతో ఆసక్తి నెలకొంటుంది. కానీ జింబాబ్వే టూర్ అనగానే అభిమానులు చప్పబడిపోయారు. దానికి తోడు అక్కడ జరుగుతున్న మ్యాచ్ లు ఇండియాలో జరిగే రంజీ మ్యాచ్ ల కంటే అధ్వానంగా సాగుతుండడంతో మరీ నీరసపడిపోయారు. దీంతో వన్డేలు చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వన్డేల పరిస్థితే ఇలా ఉంటే... ఇక టెస్టుల సంగతేంటని పలువురు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జింబాబ్వే జట్టు ఒకప్పుడు వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీలలో సత్తాచాటే ప్రయత్నం చేసింది. ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్, గ్రేమ్ హిక్, హీత్ స్ట్రీక్, హెన్రీ ఒలాంగా వంటి ఆటగాళ్లు తమ ప్రతిభతో జట్టును నిలబెట్టారు. తరువాతి కాలంలో జింబాబ్వే పసికూనగా మారిపోయింది. ఆటే రానట్టు ఆడుతోంది. రంజీ స్థాయి ఆటతీరుతో నాసికట్టుగా తయారైంది.

  • Loading...

More Telugu News