: డ్రగ్స్ వ్యాపారం పంజాబ్‌లో అత్యంత తేలిక‌: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ పంజాబ్‌లోని జ‌లంధ‌ర్ వ‌ద్ద ఈరోజు మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఆ రాష్ట్రంలో పేట్రేగిపోతున్న డ్ర‌గ్స్‌, లా అండ్ ఆర్డ‌ర్ అంశాల‌పై వారు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి విజ‌యాన్ని క‌ట్ట‌బెడితే పంజాబ్‌లో డ్ర‌గ్స్ లేకుండా చేస్తామ‌ని ఉద్ఘాటించారు. పంజాబ్ లో డ్ర‌గ్స్ అత్యంత తేలికైన వ్యాపారంగా మారిపోయింద‌ని, వాటిని అరిక‌ట్ట‌డంలో పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న అన్నారు. మ‌త్తు ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేసే వారి నుంచి పంజాబ్ ప్ర‌భుత్వం లాభం పొందుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌ధాన మంత్రి మోదీ కూడా ఈ అంశంపై నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News