: 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
టీమిండియా జింబాబ్వే పర్యటనలో భాగంగా అక్కడి హరారేలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే జట్టు 34.3 ఓవర్లకి 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా కారుణ్ నాయర్, లోకేశ్ రాహుల్ బరిలోకి దిగారు. జింబాబ్వే బ్యాట్స్మెన్ లో సిబంద 53 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.