: చిరంజీవిపై నిప్పులు చెరిగిన మాల మహానాడు కార్యకర్తలు.. దిష్టిబొమ్మ దగ్ధం!
రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవిపై మాలమహానాడు కార్యకర్తలు నిప్పులు చెరిగారు. చిరంజీవి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడం భావ్యం కాదని ఈరోజు వారు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన నిర్వహించారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుబోయారని, ప్రజారాజ్యం పార్టీ ఉనికిని నిలబెట్టుకోలేకపోయారని కార్యకర్తలు చిరంజీవిపై విమర్శలు గుప్పించారు. అంబేత్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో మాల మహానాడు కార్యకర్తలు చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిరంజీవిని తిరగనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.