: జగన్‌పై కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చెయ్యాలి: సోమిరెడ్డి


వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌గ‌న్ అశాంతి సృష్టిస్తున్నార‌ని ఆయన అన్నారు. ఈరోజు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల‌పై విచార‌ణ‌ను కింది కోర్టులు జాప్యం చేస్తున్నాయని అన్నారు. జ‌గ‌న్‌పై కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి కేసుల విచార‌ణ‌ను ఏడాదిలోగా పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పిందని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News