: భారత్ ధాటికి కుప్పకూలిన జింబాబ్వే టాపార్డర్... 112/7
హరారేలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే జట్టు కుప్పకూలింది. 107 పరుగులకే ఆరు కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లోకి జారి పోయింది. సిబందా 53, చిబాబా 21 పరుగులు మినహా మరే ఆటగాడూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేక పోయారు. మసకజ్జా 9, మూర్ 1, రజా 16, చిగుంబరా 0, ముతుంబావి 2 పరుగులకు అవుట్ కాగా, క్రీమర్ 2 పరుగులతో క్రీజలో ఉన్నాడు. భారత బౌలర్లలో చాహల్ 3, శ్రాన్ 2, కులకర్ణి, బుమ్రాలు చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం జింబాబ్వే స్కోరు 30.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు.