: లార్డ్స్ మైదానంలో శ్రీలంక వినూత్న నిరసన!


అవుటైన ఆటగాడిని నాటౌట్ గా ప్రకటించి, తమ గెలుపును సంక్లిష్టం చేసిన అంపైర్ల వైఖరిని నిరసిస్తూ, క్రికెట్ పుట్టినిల్లుగా పేరున్న లార్డ్స్ మైదానంలో శ్రీలంక జట్టు వినూత్నంగా నిరసన తెలిపింది. లార్డ్స్ బాల్కనీలో లంక జట్టు జెండాను కట్టి తమ నిరసన తెలిపింది. ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో లంక ఆటగాడు ప్రదీప్ వేసిన బంతికి 58 పరుగులతో క్రీజులో ఉన్న హేల్స్ ఔట్ అయ్యాడు. దాన్ని అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో లైఫ్ తెచ్చుకున్న హేల్స్ ఆపై 94 పరుగుల వద్ద అవుట్ కాగా, ఇంగ్లండ్ జట్టు 233 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి లంకకు 362 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆపై ప్రదీప్ వేసిన బంతి నోబాల్ కాదని రీప్లేలో తేలడంతో తమకు అన్యాయం జరిగిందని లంక వాదిస్తోంది. మరికాసేపట్లో 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న లంక నిన్నటి ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News