: తిరుమలలో చిరుతల సంచారం... భక్తుల్లో భయాందోళనలు!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తోన్న భక్తులను చిరుతల భయం పట్టుకుంది. తిరుమలలో రోజుకో చోట, పూటకో ప్రాంతంలో చిరుత పులులు సంచరిస్తూ భయపెడుతున్నాయి. మఠాలు, నడక దారుల్లో సంచరిస్తూ అక్కడి పరిసర ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతోన్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అక్కడి మఠంలో ఓ చిరుత ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు చిరుతలు దర్జాగా తిరుగుతూ అక్కడి రింగ్‌రోడ్డు సమీపంలో కనిపించాయి. చిరుతలు అక్కడి ప్రాంతంలో సంచరిస్తుండగా ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. చిరుతల సంచారం పట్ల శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.