: ‘రూ.5 కే భోజనం’ కొని తిన్న కేటీఆర్.. బాగుందన్న మంత్రి!
హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై వస్తోన్న ఫిర్యాదుల నేపథ్యంలో యూసఫ్ గూడ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం నగరంలోని షాపూర్‌నగర్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అక్కడ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.5 కే భోజనం అందిస్తోన్న కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. కేటీఆర్ స్వయంగా రూ.5 ఇచ్చి భోజనాన్ని కొని తిన్నారు. భోజనం నాణ్యతపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.5కే చక్కని భోజనం అందుతోందని ఆయన కొనియాడారు.