: అమెరికాలో తప్పిన మరో ముప్పు... మూడు తుపాకులు, పేలుడు పదార్థాలతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్


ఓర్లాండో నైట్ క్లబ్ లో జరిగిన నరమేధం నుంచి ఇంకా కోలుకోని అమెరికాలో మరో పెను ముప్పు తప్పింది. వెస్ట్ హోలాండ్ లో గే పరేడ్ జరుగుతున్న వేళ, అటువైపుగా మూడు తుపాకులు, పేలుడు పదార్థాలతో వెళుతున్న జేమ్స్ వెస్లే హొవెల్ అనే ఇరవై ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఫర్సన్ విల్లేకు చెందిన ఇతని వద్ద తుపాకులు ఎందుకున్నాయన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తొలుత ఇతను గే పరేడ్ లో విధ్వంసం సృష్టించేందుకు వెళుతున్నాడని చెప్పిన ఫెడరల్ పోలీసులు, ఆపై అతను పరేడ్ లో పాల్గొనేందుకు మాత్రమే వెళుతున్నట్టు చెప్పాడని, అతను ఎయిర్ ఫిల్టర్ కంపెనీలో ఆడిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. ఇటీవల అతను హిల్లరీ క్లింటన్ ఉపన్యాసాన్ని హిట్లర్ మాటలతో పోలుస్తూ ట్వీట్లు పెట్టాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News