: కేసీఆర్ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు బాగున్నాయి, అందుకే టీఆర్ఎస్ లోకి వెళుతున్నాం!: కాంగ్రెస్ నేత వివేక్‌


కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి జంప్ కానున్న నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ హైదరాబాదు, సోమాజీగూడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తామ‌ని, ఈనెల 15న టీఆర్ఎస్‌లోకి చేరుతున్నామ‌ని పేర్కొన్నారు. కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు చెప్పారు. తాము గ‌తంలో తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ నివేదిక ఇచ్చామ‌ని, ఆ నివేదిక‌లో ఉన్న ఆ అంశాలు ఇప్పుడు కేసీఆర్ చేసి చూపుతున్నారని వివేక్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ప్ర‌యత్నాలు చేశామ‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గొప్ప వ్య‌క్తి అని, తెలంగాణ ఇవ్వాల‌ని ఆమె నిర్ణ‌యం తీసుకున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. రెండేళ్ల‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు బాగున్నాయని, అందుకే టీఆర్ఎస్ లోకి చేరుతున్నామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News