: అనుమ‌తిలేని స్కూల్ బస్సులపై కొర‌డా ఝుళిపిస్తోన్న‌ ఆర్టీఏ అధికారులు


వేస‌వి సెల‌వుల అనంత‌రం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తెరుచుకున్నాయి. చాలా వ‌ర‌కు ప్రైవేటు పాఠశాలలు కొన్ని రోజుల క్రిత‌మే ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు ప్రారంభం అవుతోన్న వేళ‌ ఆర్టీఏ అధికారులు ఈరోజు స్కూల్ బస్సులపై కొరడా ఝుళిపించారు. అనుమతి లేకుండా రోడ్ల‌పై తిరుగుతోన్న స్కూల్ బస్సులను విద్యార్థుల క్షేమం దృష్ట్యా అధికారులు ఏ మాత్రం ఉపేక్షించ‌డం లేదు. తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ బ‌స్సుల‌ను త‌నిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఎల్‌బీనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 బస్సులను సీజ్ చేశారు. మెద‌క్‌లో అనుమ‌తులు లేకుండా రోడ్ల‌పై క‌న‌ప‌డిన 8 స్కూలు బస్సులను అధికారులు సీజ్ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాల్లో ఆర్టీఏ అధికారులు అనుమతులు లేకుండా నడిపిస్తోన్న పలు స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News