: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం రద్దు.. ఆందోళ‌న‌కు దిగిన ప్ర‌యాణికులు


శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు దిగారు. ఈరోజు ఉద‌యం బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం కోసం ఎదురుచూస్తోన్న 250 మంది ప్ర‌యాణికుల‌కు ఆ విమానం ర‌ద్ద‌యింద‌నే వార్త వ‌చ్చింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండ‌న్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈరోజు ఉద‌యం రావాల్సిన ఆ విమానం అక్క‌డికి చేరుకోక‌పోవ‌డంతో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ అధికారులు ఆ విమానాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న చేశారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం కోసం ఎదురుచూస్తోన్న ప్ర‌యాణికులకు నోవాటెల్ హోట‌ల్‌లో వసతి ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News