: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. నేడు మహబూబ్నగర్లో బీజేపీ సభ
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నేడు బీజేపీ మహబూబ్ నగర్ జిల్లాలో వికాస్పర్వ్ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమీక్షిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు.