: లైన్ క్లియర్... 13 కట్స్ తో 'ఉడ్తా పంజాబ్'కు ఓకే
విడుదలకు ముందే వివాదాస్పదమైన హిందీ చిత్రం 'ఉడ్తా పంజాబ్'కు 13 కట్స్ తో సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ ఇస్తున్నట్టు సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రహ్లాజ్ నిహలానీ వెల్లడించారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ, సెన్సార్ బోర్డు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బాంబే హైకోర్టులో విచారణ జరుగగా, సెన్సార్ బోర్డు వైఖరిని న్యాయమూర్తులు తప్పుబట్టారు. కష్టపడి తీసిన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా, మీ సెన్సారింగ్ ఏంటని కూడా కోర్టు మండిపడింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడేందుకు కొన్ని గంటల ముందు సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, అడ్డంకులన్నీ తొలగిపోవడంతో, ముందుగా అనుకున్నట్టుగానే 17న చిత్రం థియేటర్లను తాకనుంది.