: వాడు అత్యంత క్రూరుడు... నన్ను హింసించేవాడు: ఓర్లాండో ముష్కరుడి మాజీ భార్య


ఓర్లాండో నైట్ క్లబ్ పై విచక్షణారహితంగా దాడి చేసి 50 మందిని కాల్చి చంపి అమెరికా చరిత్రలో అతిపెద్ద సామూహిక హత్యాకాండకు కారణమైన ఒమర్ మతీన్ అత్యంత క్రూరుడని అతని మాజీ భార్య వెల్లడించింది. "మేము ఎనిమిదేళ్ల క్రితం కలుసుకున్నాం. అతన్ని వివాహం చేసుకున్న కొత్తల్లో బాగానే ఉన్నాడు. ఆపై అతనిలోని రాక్షసత్వం బయటపడింది. నిత్యమూ కొట్టేవాడు. ఇంటికి వచ్చీరాగానే నన్ను హింసించడమే పనిగా పెట్టుకునే వాడు. బట్టలు ఉతకలేదంటూ, ఇల్లు సరిగా లేదంటూ సాకులు చూపుతూ తీవ్రంగా కొట్టేవాడు. మానసికంగా స్థిరంగా ఉండేవాడు కాదు. మా వివాహం 2009 మార్చిలో అయిన తరువాత ఫ్లోరిడాలో రెండు పడకగదుల ఇంట్లో ఉన్నాం. చూడటానికి మామూలుగానే కనిపించే ఒమర్, మతపరమైన అంశాల్లో చాలా కఠినంగా ఉండేవాడు. నన్ను కొట్టేటప్పుడు అతని తండ్రి అడ్డుపడేవాడు. ఆయన నా జీవితాన్ని కాపాడాడు. ఒమర్ వద్ద కొద్ది నెలలు మాత్రమే ఉన్నాను. 2011లో విడాకులు తీసుకున్నాను. నేనిప్పుడు చాలా లక్కీ అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News