: 911కు ముందే ఫోన్ చేసి చెప్పి మరీ తెగబడ్డ ఒమర్ మతీన్
అమెరికాలోని ఫ్లోరిడా పరిధిలో ఉన్న ఓర్లాండోలోని నైట్ క్లబ్ పై దాడిచేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకున్న ఒమర్ మతీన్, కాల్పులకు ముందే 911కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని నిఘా హౌస్ సెలక్ట్ కమిటీ సభ్యుడు యాడం పిఫ్ వెల్లడించారు. ఎక్కడ దాడి చేయబోతున్నానన్న విషయాన్ని వెల్లడించని ఒమర్ మతీన్, తాను ఐఎస్ఐఎస్ మద్దతుతో కాల్పులకు దిగనున్నానని, పురుషులు ముద్దులు పెట్టుకోవడం తనకు గిట్టక ఈ పని చేస్తున్నానని చెప్పుకున్నాడట. కాగా, ఒమర్ కు హోమోఫోబియో (స్వలింగ సంపర్కం పట్ల వ్యతిరేకత) ఉందని, గతంలో ఎలాంటి నేరచరిత్రా లేదని అధికారులు వెల్లడించారు.