: ఓర్లాండో నరమేధం మా పనే: ప్రకటించుకున్న ఐఎస్ ముష్కరులు


అమెరికాలోని ఫ్లోరిడా నగరంలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో చోటుచేసుకున్న నరమేధం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఈ మేరకు ఐఎస్ వార్తా సంస్థ ‘‘అమక్’... ఓర్లాండోలో బీభత్సం సృష్టించిన దుండగుడు ఐఎస్ కు చెందిన ఫైటరేనని ప్రకటించింది. దాడి జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా ... సదరు దుండగుడికి ఉగ్రవాద లింకులున్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. దాడి వెనుక ఉగ్రవాద కోణం కనిపిస్తున్నా.. దుండగుడిని ఐఎస్ ఉగ్రవాదిగా గుర్తించలేకపోయారు. అయితే దుండగుడి వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాత అతడు ఐఎస్ ఉగ్రవాదేనని తేలింది. విచక్షణారహితంగా కాల్పులకు దిగి 50 మందిని పొట్టనబెట్టుకున్న ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు ఒమర్ మతీన్ గా గుర్తించారు. మతీన్ ఫ్లోరిడాకు చెందిన యువకుడే. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చి ఫ్లోరిడాలో స్థిరపడ్డ దంపతులకు అతడు జన్మించాడు. అమెరికాలో ఉంటూనే అతడు ఐఎస్ వైపు ఆకర్షితుడయ్యాడు. గతంలో ఓ మారు అతడిని ఎఫ్ బీఐ అధికారులు ప్రశ్నించారట. ఆత్మాహుతి దళ సభ్యుడితో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అతడిని ప్రశ్నించినట్లు నిన్న ఎఫ్ బీఐ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News