: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి రాజమౌళి కితాబు... థ్యాంక్స్ చెప్పిన క్రిష్!
టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను ఆ సినిమా యూనిట్ ఈ మధ్యే విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ ఫస్ట్ లుక్ ను చాలా ఆలస్యంగా చూశానని, చాలా అద్భుతంగా ఉందని ట్విట్టర్లో ప్రశంసించారు. దీనికి స్పందించిన క్రిష్...'థ్యాంక్యూ సర్, మీరు మెచ్చుకున్నారంటే అంతే చాలు' అని సమాధానమిచ్చారు.