: ఫ్లోరిడా నైట్ క్లబ్ కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా, 53 మందికి గాయాలు
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని పల్స్ 'గే' నైట్ క్లబ్ లో చోటుచేసుకున్న విషాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఉగ్రవాద కోణంపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. దుండగుడు జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో 50 మంది మృతి చెందగా, మరో 53 మంది తీవ్రగాయాలపాలయ్యారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని దుండగుడ్ని కాల్చి చంపారు. దుండగుడి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని, ఐఎస్ఐఎస్ కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.