: షూటింగ్ చేయద్దంటే చేసినందుకు.. బాలీవుడ్ నటుడి కునాల్‌ పై రాళ్లదాడి


'కాల్ యుగ్', 'ట్రాఫిక్ సిగ్నల్' వంటి సినిమాలతో బాలీవుడ్‌ నటుడిగా నిరూపించుకుని, సైఫ్‌ అలీ ఖాన్‌ సోదరి సోహా అలీఖాన్ ను వివాహం చేసుకున్న కునాల్‌ ఖేముకి లక్నోలో చేదు అనుభవం ఎదురైంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేని కునాల్‌ ‘సవారే’ అనే మ్యూజిక్‌ అల్బమ్‌ లో నటిస్తున్నాడు. దీని షూటింగ్ లక్నోలోని నౌబత్ ఖానా ప్రాంతంలోని ఇమాంబర్ ఎదుట జరుగుతోంది. అక్కడ షూటింగ్ చేయవద్దని స్థానికులు అభ్యంతరం చెప్పారు. అయినా, వారిని పట్టించుకోకుండా షూటింగ్ చేయడంతో సినిమా యూనిట్ పై వారు దాడికి దిగారు. వివాదం రేగడంతో వ్యానిటీ వ్యాన్‌ లోపలికి కునాల్ ఖేము వెళ్లిపోగా, దానిపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో కునాల్‌ కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనుమతి లేకుండా షూటింగ్‌ చేస్తున్న నిర్మాతపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News