: మెగా హీరోలతో కలసి నటించే అవకాశం లేదు... కథ కుదిరితే కుటుంబం మొత్తం నటిస్తాం!: నిహారిక
మెగా హీరోయిన్ గా సినిమాల్లో అడుగుపెట్టిన నిహారిక తాను మెగా హీరోలతో కలసి నటించే అవకాశం లేదని చెప్పింది. 'ఒక మనసు' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెగా హీరోల్లో ఎవరితోనూ నటించే అవకాశం లేదని చెప్పింది. ఒకవేళ అలాంటి స్క్రిప్టు దొరికితే నటించాలో వద్దో ఆలోచిస్తానని తెలిపింది. అలా కాకుండా తమ కుటుంబం మొత్తాన్ని పెట్టి ఎవరైనా సినిమా తీస్తే అందులో నటిస్తానని చెప్పింది. కానీ అలాంటి సినిమా ఎవరు తీస్తారని ప్రశ్నించింది. అలాంటి అవకాశం లేదు కనుక మెగా హీరోలతో నటించే అవకాశం లేదని చెప్పింది.