: జైపూర్లో జయభేరి మోగించేదెవ్వరో..
పింక్ సిటీ జైపూర్ నేడు ఐపీఎల్ కీలక సమరానికి వేదికగా నిలవనుంది. కాసేపట్లో ఇక్కడి సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. కాగా, చెన్నైతో మ్యాచ్ కు దూరమైన సన్ రైజర్స్ కెప్టెన్ సంగక్కర, ఆల్ రౌండర్ తిసర పెరీరా, అక్షత్ రెడ్డిలు ఈ మ్యాచ్ తో మళ్ళీ జట్టులోకి వచ్చారు. దీంతో, వైట్, క్వింటన్ డికాక్, తలైవన్ సర్గుణమ్ లకు విశ్రాంతినిచ్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సంగక్కర బ్యాటింగ్ ఎంచుకున్నాడు.