: ప్రైవేటు పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం: గంటా


ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, విద్యాహక్కు చట్టం అమలు, విద్యాబోధనలో నాణ్యత, పాఠశాల బస్సుల సామర్థ్యం వంటి విషయాలపై నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం నడవని, నిబంధనలను పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విశాఖపట్టణం జిల్లాలో 55 ప్రాథమిక, 87 ఉన్నత పాఠశాలలకు అనుమతులు లేవని గుర్తించామని ఆయన చెప్పారు. వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News