: హిందువుల సామూహిక వలసలు.. కారణాలపై ఆరా తీయడానికి బీజేపీ కమిటీ


ఉత్తరప్రదేశ్ లోని కైరానా పట్టణంలో ఆస్తులన్నీ వదిలేసి ఉన్నపళంగా హిందువులు సామూహిక వలసలు వెళ్లడం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి బీజేపీ రంగంలోకి దిగింది. షామ్లీ జిల్లాలోని కైరానా పట్టణంలో నివాసముండే హిందువులు గత కొంత కాలంగా వలసలు వెళ్లిపోతున్నారని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి హుకుం సింగ్ ఆరోపించడంతో కలకలం రేగింది. ఇప్పటి వరకు కైరానా నుంచి 346 హిందూ కుటుంబాలు వలస వెళ్లిపోయాయని ఆయన తెలిపారు. ఈ పట్టణం మరో కాశ్మీరులా తయారైందని, మతపరమైన హత్యలు కనీసం పది జరిగాయని ఆయన ఆరోపించారు. దీంతో వాస్తవాలు నిగ్గుతీసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. 9 మంది సభ్యులు గల ఈ కమిటీ ఈనెల 16న కైరానాలో పర్యటించనుంది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఈ కమిటీలో పార్లమెంటు సభ్యులు ఉంటారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News