: షాంగై ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు
షాంగై ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. చైనాలోని షాంగైలో గల పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రయాణికుల తనిఖీలు నిర్వహించే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో నలుగురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, అధికారులు చికిత్స అందిస్తున్నారు. కాగా, విమానాశ్రయంలో సంభవించిన పేలుళ్లు సీసీటీవీ పుటేజ్ లో రికార్డవడంతో సోషల్ మీడియాలో పేలుళ్లు వైరల్ గా మారాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.