: ఫ్లోరిడా నైట్ క్లబ్ లో కాల్పులు... భారీగా ప్రాణ నష్టం!
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని పల్స్ స్వలింగ సంపర్కుల నైట్ క్లబ్ లో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున నైట్ క్లబ్ లో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. క్లబ్ ను మూసేసేందుకు కాస్త సమయం ఉందనగా ప్రవేశించిన దుండగుడు కాల్పులతో ఆ ప్రాంతాన్ని వణికించాడు. మరి కొందరిని బందీలుగా చేసుకుని పోలీసులకు ఎదురొడ్డాడు. అయితే పోలీసు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. దుండగుడు క్లబ్ లోకి ప్రవేశించే సమయంలో అందులో సుమారు వంద మంది వరకు ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ప్రాణనష్టం భారీగా సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.