: రెండేళ్ల తరువాత ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన సైనా నెహ్వాల్


సైనా నెహ్వాల్ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ పోరులో చైనాకు చెందిన సున్ యూ (వరల్డ్ 12 ర్యాంకర్) పై సైనా నెహ్వాల్ 11-21, 21-14, 21-19 తేడాతో విజయం సాధించింది. ఇండియన్ ఓపెన్, మలేషియా ఓపెన్, ఆసియా ఛాంపియన్ షిప్ లలో సెమీస్ వరకు చేరినప్పటికీ ఫైనల్స్ కు చేరలేక సైనా చతికిలబడిపోయింది. ఇండోనేసియన్ ఓపెన్ లో పేలవ ప్రదర్శనతో సెమీస్ కు కూడా చేరలేకపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్ లో మాత్రం తనకంటే మెరుగైన క్రీడాకారిణులను ఇంటి ముఖం పట్టించిన సైనా టైటిల్ విజేతగా నిలిచింది.

  • Loading...

More Telugu News