: మళ్లీ డిజప్పాయింట్ అయిన నయనతార?
ప్రముఖ కథానాయిక నయనతారకు ప్రేమ అన్నది అస్సలు కలిసిరావడంలేదు. గతంలో శింబు, ప్రభుదేవాలతో ఆమె ప్రేమ సక్సెస్ కాలేదు. కారణాలేవైనా నయనతార బ్రేకప్ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా తమిళనాట నయనతార లవ్ బ్రేకప్ కథనాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమలో పడడంతో మతం కూడా మార్చుకున్నాడని, వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా పుకార్లు షికారు చేశాయి. తాజాగా వీరి బంధం బద్దలైందన్న కథనాలు కోలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. వరుసగా మూడు సార్లు ప్రేమలో విఫలమవడంతో నయనతార డిజప్పాయింట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.