: ఇండోర్ సైన్స్ విద్యార్థుల చేతుల్లో గర్జించిన ఏకే 47 గన్స్!


ఇండోర్ లోని హోల్కర్ సైన్స్ కాలేజీలో నిన్న జరిగిన 125వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కొందరు విద్యార్థులు ఏకే-47 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతూ నృత్యాలు చేయడం కలకలం సృష్టించింది. కాలేజీ ఉన్నతాధికారులు సైతం ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతమైంది. ఓ ఉపాధ్యాయుడు 'తుపాకులు చూపవద్దు' అని అరుస్తుండటం కూడా వీడియోలో వినిపించడం గమనార్హం. తుపాకులను విద్యార్థులు వాడారని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లేసరికి ఆ విద్యార్థులు పారిపోయారని తెలుస్తోంది. "నేను చాలాసేపు వేడుకల్లో పాల్గొన్నా. అయితే, ఈ ఘటన నేను వెళ్లిపోయిన తరువాత జరిగింది. ఎవరో బయటి వారు వేడుకలకు ఆయుధాలు తెచ్చారని అనుకుంటున్నా" అని ఎన్ఎస్యూఐ లీడర్ జావేద్ వివరించాడు. తామిచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు వచ్చారని తెలిపారు. కాగా, తాము వెళ్లేసరికి ఎవరి వద్దా తుపాకులు లేవని పోలీసులు వెల్లడించారు. వీడియోను చూస్తున్నామని, తుపాకులు పేల్చిన వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News