: వాస్తవాలు చెప్పేందుకు భయమెందుకురా బాబూ నీకు?: పవన్ కల్యాణ్ పై వీహెచ్ విసుర్లు


నిరాహార దీక్ష చేస్తున్న కాపు వర్గం నేత ముద్రగడను పరామర్శించేందుకు ఈ ఉదయం రాజమండ్రి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. "పవన్ కల్యాణ్ కూడా నోరు విప్పాలండీ... ఎందుకు విప్పొద్దు? వాస్తవాలు చెప్పేందుకు భయమెందుకురా బాబూ నీకు? రా... వాస్తవాలు చెప్పు. ముద్రగడ తప్పు చేస్తుంటే తప్పని చెప్పు. కరెక్ట్ చేస్తుంటే కరెక్టని చెప్పు. అంతేగానీ, నేను న్యాయం గురించి కొట్లాడతా. నేను అవినీతిని నిర్మూలిస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే... ఆయన పెట్టిన పార్టీ పేరేంటి... జనసేనా... మరి జనసేన ఎక్కడా కనిపిస్తలేదే? ఇప్పటికన్నా నోరిప్పు మిత్రమా... మా మిత్రుడిది తప్పంటే తప్పని చెప్పు. కాపుల ఉద్యమం తప్పంటే తప్పని చెప్పు. లేకుంటే తప్పుకాదని చెప్పు. రెండూ చెప్పకుంటే ఎలా?" అని అన్నారు. కాగా, ముద్రగడను కలిసేందుకు వీహెచ్ ని అనుమతించని పోలీసులు, ఆయన్ను హోటల్ గదిలోనే నిర్బంధించారు.

  • Loading...

More Telugu News