: క్షీణించిన ముద్రగడ భార్య, కోడలి ఆరోగ్యం
కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంపై, పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ, ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంతో పాటు దీక్ష చేపట్టిన ఆయన భార్య, కోడలు ఆరోగ్యం క్షీణించిందని, వారు తక్షణం దీక్ష విరమించకుంటే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఈ ఉదయం ముద్రగడ అనుమతితో భార్య, కోడళ్లకు వైద్య పరీక్షలు చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ముద్రగడ మాత్రం తనకు ఏ విధమైన పరీక్షలు వద్దని భీష్మించుకుని కూర్చున్నారని తెలిపారు. కాగా, దీక్ష ప్రారంభించిన అనంతరం, పురుగుల మందు డబ్బా పట్టుకుని తాను ఆత్మహత్య చేసుకుంటానని ముద్రగడ బెదిరించగా, ఆయనపై ఆత్మహత్యాయత్నం కేసును పెట్టిన పోలీసులు, బలవంతంగా అరెస్ట్ చేసి రాజమండ్రి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.