: జేఈఈ అడ్వాన్స్ డ్ - 2016... టాప్ 100లో 30 శాతం తెలుగు విద్యార్థులు


2016 సంవత్సరానికిగాను జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షా ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదల అయ్యాయి. మిగతా జాతీయ స్థాయి పరీక్షల్లో మాదిరే ఇందులో కూడా తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 30 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండటం గమనార్హం. తెలుగు విద్యార్థి జీవితేశ్ జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్ జోన్ కు ఐదు ర్యాంకులు రావడం గమనార్హం. తెలుగు వారికి వచ్చిన ర్యాంకుల్లో 50 శాతం తమ విద్యార్థులవేనని నారాయణ శ్రీచైతన్య సంయుక్త విద్యాసంస్థ ప్రకటించుకుంది.

  • Loading...

More Telugu News