: అడవి పందుల్లా మేశారు... రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు: చంద్రబాబు నిప్పులు
తాను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేశానని, ఆపై 2004లో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు పొలాలపై పడే అడవి పందుల్లా మేసినంత మేసి, మిగతాది నాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఎక్కడో ఉండాల్సిన రాష్ట్రం, అభివృద్ధిలో ఇప్పుడు తిరిగి మొదటి మెట్టుపై ఉందని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం తప్ప మరేమీ లేదని, ముక్కలైన రాష్ట్రంలో ఓ భాగాన్ని తానిప్పుడు తిరిగి గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. తన విజన్ 2020ని దారి తప్పించారని, ఇప్పుడు పాలనలో కంటిన్యుటీ ఉంటే తప్ప దూసుకెళ్లలేమని ప్రజలకు తాను స్పష్టం చేస్తున్నానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.