: షేరిట్ వేగంతో పోలిస్తే నాలుగింతల స్పీడ్ తో బ్లూటూత్-5


రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య ఏ విధమైన ఖర్చూ లేకుండా సమాచార బట్వాడాకు సహకరించే బ్లూటూత్ సరికొత్తగా వచ్చేసింది. మరింత వేగంతో ఇది పనిచేస్తుందట. బ్లూటూత్ కు 5వ తరంగా వస్తున్న బ్లూటూత్-5, షేరిట్ వంటి యాప్ లతో పోలిస్తే నాలుగు రెట్ల వేగంతో ఇది పనిచేస్తుంది. సాధారణ బ్లూటూత్ తో పోలిస్తే రెండింతల అధిక దూరం వరకూ సిగ్నల్స్ అందుతాయి. బ్యాటరీ కూడా తక్కువగా ఖర్చవుతుందని ఈ సరికొత్త వర్షన్ ను అభివృద్ధి చేసిన స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎన్ఐజీ) తెలియజేసింది. ఈ నెల 16వ తేదీన బ్లూటూత్ - 5ను విడుదల చేయనున్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News