: తాజా సర్వేలో డొనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్


నిన్న మొన్నటి వరకూ అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికిన అమెరికన్లు, మనసు మార్చుకున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నుంచి పోటీ పడుతున్న వీరిలో ఎవరిని కోరుకుంటున్నారని అడుగుతూ, దాదాపు ఐదు రోజుల పాటు ఓ అన్ లైన్ పోల్ జరుగగా, హిల్లరీ అధ్యక్షురాలు కావాలని 46 శాతం మంది, ట్రంప్ అయితే మేలని 34.8 శాతం మంది కోరుకున్నారు. మిగతావారు ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేదని వెల్లడించారు. ట్రంప్ కన్నా హిల్లరీ 11 శాతానికి పైగా మద్దతు పొందడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 8న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News