: ధోనీ రికార్డును ఈక్వల్ చేసిన అంబటి రాయుడు
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాడు ఎవరైనా భారత జట్టులో ఉన్నాడంటే, అతను అంబటి రాయుడేనన్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న జింబాబ్వేతో జరిగిన వన్డే క్రికెట్ పోటీలో రాయుడు ఓ రికార్డును అందుకున్నాడు. ఇండియా తరఫున 29 వన్డేల్లో 1000 పరుగులు చేసిన కెప్టెన్ ధోనీ రికార్డును రాయుడు సమం చేశాడు. మూడు సంవత్సరాల క్రితం జింబాబ్వేపైనే అరంగేట్రం చేసిన రాయుడు, అదే జట్టుపై 1000 పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. జింబాబ్వే పర్యటనలో భాగంగా ఇండియా మరో రెండు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లను ఆడనుంది.