: చంద్రబాబు సంతకమే తరువాయి... 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్


నవ్యాంధ్రలో నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీల భర్తీ విషయంలో చంద్రబాబు సర్కారు చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 10 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, అందులో 6 వేల వరకూ పోలీసు, జైళ్ల శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా నాలుగు వేల ఖాళీలకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల దస్త్రం, సీఎం టేబుల్ పై ఉండగా, ఆయన సంతకం పెడితే జీఓ విడుదలై, ఆ వెంటనే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడుతుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాల్లో భాగంగా, గ్రూప్ వన్ పరిధిలో డిప్యూటీ కలెక్టర్లు 5, డీఎస్పీలు 24, వాణిజ్య పన్నుల అధికారులు 13, మునిసిపల్‌ కమిషనర్లు 13, ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు 10, జిల్లా సైనిక సంక్షేమాధికారులు 2, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు 4, జిల్లా రిజిస్ట్రార్లు 8, కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్లు 10 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటితో పాటు గ్రూప్‌ - 2, గ్రూప్ - 3 పరిధిలోని పలు ఖాళీగా ఉన్న పోస్టులనూ ఏపీ సర్కారు భర్తీ చేయనుంది.

  • Loading...

More Telugu News