: కాకి వాలిందని కారు మార్చేసిన కర్ణాటక సీఎం!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొనుక్కోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కారు కొనడానికి కారణం ఏంటంటే...సిద్ధరామయ్య కారుపై జూన్ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్ తరిమికొట్టినా అది కారును వీడలేదు. ఇలా సుమారు 10 నిమిషాల పాటు ఆ కాకి కారుపైనే ఉండిపోయింది. హిందూ సంప్రదాయంలో కాకి అశుభసూచకం. అలాంటిది సుమారు పది నిమిషాల పాటు కాకి వాలడంతో మీడియా పదేపదే కాకిని చూపించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఈ అపశకునం ఎందుకు అనుకున్న సిద్ధరామయ్య ఆ కారును పక్కన పెట్టేసి, 35 లక్షల రూపాయలు పెట్టి టొయోటా ఫార్చ్యునర్ కారును కొనుగోలు చేశారు. దీంతో కాకి వాలడం వల్లే సీఎం కొత్త కారు కొనేశారంటూ మళ్లీ మీడియా వార్తలు ప్రసారం చేసింది.