: మాల్యాకు ఈడీ షాక్... మరిన్ని ఆస్తులు అటాచ్
9 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యాకు ఈడీ షాకిచ్చింది. ఐడీబీఐ బ్యాంకుకు సంబంధించిన అటాచ్ మెంట్ ను చేపట్టిన ప్రభుత్వం ముంబై, బెంగళూరు, చెన్నైలలో గల విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులను ఎటాచ్ చేసింది. ఇందులో భాగంగా 1411 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 34 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, బెంగళూరు, ముంబై పట్టణాల్లో ఉన్న రెండు ప్లాట్లు, చెన్నైలోని 4.5 ఎకరాల ఇండస్ట్రియల్ భూమి, కర్ణాటకలోని కూర్గ్ లో 28.75 ఎకరాల్లో విస్తరించిన కాఫీ తోటలను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ 1411 కోట్ల రూపాయలని ఈడీ తెలిపింది.