: విమాన ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌.. ఇక‌పై టికెట్ ర‌ద్ద‌యితే అధిక ఛార్జీల వ‌సూళ్లు ఉండ‌వు!


విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకున్న సమయంలో టికెట్ బేస్ ధర కంటే టికెట్‌ క్యాన్సిల్ ఛార్జీలు ఎక్కువగా ఉండ‌డానికి వీల్లేద‌ని నిబంధ‌న‌లు పెట్టింది. టిక్కెట్ బేస్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటంతో ప్ర‌యాణికులు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్న‌ప్పుడు బాగా నష్టపోయేవారు. కేంద్రం తాజాగా జారీ చేసిన ఆదేశాల‌తో ప్ర‌యాణికులకు ఇప్పుడు కాస్త ఊర‌ట ల‌భించింది. కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణికులు విమాన‌ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 15 రోజుల్లో రిఫండ్ వ‌చ్చేస్తుంది. లేదంటే ఆ డ‌బ్బుని ప్ర‌యాణికులు త‌మ త‌దుప‌రి విమాన ప్ర‌యాణం కోసం క్రెడిట్‌ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా కేంద్ర ప్ర‌యాణికుల‌ ల‌గేజీ ఛార్జీల‌పై కూడా కొత్త నిబంధ‌న‌లు జారీ చేసింది. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం పరిమిత లగేజికి మించి ప్ర‌యాణికులు త‌మ‌తో తెచ్చుకుంటే అధిక ఛార్జీల భారం వారిపై మోప‌కూడ‌దు. వారి ల‌గేజీ 15 కేజీలు దాటితే రూ.100లోపే వ‌సూలు చేయాలి. విమానం ఒక వేళ ఓవర్ బుకింగ్ అయితే విమానయాన సంస్థ‌లు ప్ర‌యాణికుల‌కు రూ.20 వేల ప‌రిహారం ఇవ్వాలి. టికెట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికుల విమానం 24 గంట‌ల్లోపు ర‌ద్ద‌యితే రూ.10 వేలు చెల్లించాలి. ప్ర‌యాణికులు ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా లేదా ఎయిర్ లైన్స్ ద్వారా ఏ విధంగా టికెట్ బుక్ చేసుకున్నా విమానయాన సంస్థలు ఈ నిబంధ‌న‌లే పాటించాలి.

  • Loading...

More Telugu News