: మీ లైసెన్స్ తో ఈ పది దేశాల్లో డ్రైవింగ్ చేయవచ్చు


విహారయాత్రలకు వివిధ దేశాలకు భారతీయులు వెళ్తుంటారు. అయితే ఆయా దేశాలను సందర్శించేటప్పుడు అక్కడ క్యాబ్ లపై ఎక్కువ మంది ఆధారపడుతుంటారు. దానికి కారణం లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకని భావించి డ్రైవింగ్ వచ్చినా మౌనంగా వాహనాలు ఎక్కేస్తుంటారు. కొన్ని దేశాల్లో కార్లను అద్దెకు ఇచ్చే సంస్థలున్నాయి. ముందుగా కొంత డబ్బు చెల్లిస్తే వాహనాలు బాడుగకు తీసుకోవచ్చు. అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్ లో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది కాలం చెల్లుతుంది. అక్కడ ఏవైనా పర్యాటక ప్రదేశాలు చూడాలంటే డ్రైవింగ్ వస్తే...జీపీఎస్ ఆధారిత కార్లను అద్దెకు తీసుకుని నేరుగా డ్రైవ్ చేసుకుని వెళ్లవచ్చు. బ్రిటన్ లో కూడా భారత డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది కాలం చెల్లుతుంది. అక్కడ కూడా హ్యాపీగా లాంగ్ డ్రైవ్ ను ఎంజాయ్ చేయవచ్చు. పచ్చిక బయళ్లకు పేరెన్నికగన్న స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటులో ఉంది. అయితే కాలపరిమితి మూడు నెలలే. సాహసం చేయాలంటే మాత్రం ప్రమాదకరమైన రోడ్లు కలిగిన నార్వేలో డ్రైవ్ ఎంజాయ్ చేయవచ్చు. సౌతాఫ్రికా, ప్రాన్స్, ఫిన్ లాండ్, జర్మనీ వంటి దేశాల్లో భారతీయ డ్రైవింగ్ లైసెన్సుతో విహారయాత్రను మరింత రమణీయంగా మార్చుకోవచ్చు. అయితే జాగ్రత్తలు తప్పని సరి.

  • Loading...

More Telugu News