: పాల్వాయి, ఆరేపల్లి, మృత్యుంజయంకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్


తెలంగాణ కాంగ్రెస్‌ లో వివిధ కారణాలపై పార్టీకి నష్టం కలిగించే రీతిలో ప్రవర్తించిన ముగ్గురు నేతలకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గాంధీభవన్‌ లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జానారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే పార్టీపై డీసీసీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌ లు చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 17న క్రమశిక్షణా సంఘం ముందు హాజరై వారు వివరణ ఇవ్వాలని ఈ షోకాజ్ నోటీసుల్లో టీపీసీసీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News