: వందరోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తామని ఇచ్చిన హామీ ఎమైందో ముందు చెప్పాలి: షబ్బీర్ అలీ
బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమైన 'వందరోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనం హామీ' ఏమైందో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చామన్న అమిత్ షా వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తీవ్రమైన కరవు తెలంగాణలో ఏర్పడితే కేవలం 70 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. అన్నీ సర్దుకుంటాయని ఆయన తెలిపారు.